Pages

Sunday, 27 May 2012

పూరి చెప్పింది నచ్చలేదు... టైటిల్ ఖరారు చేసిన పవన్!

పూరి చెప్పింది నచ్చలేదు... టైటిల్ ఖరారు చేసిన పవన్!

శనివారం, మే 27, 2012, 17:52 [IST]
Pawan Corrected The Title


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రం రూపొందబోతున్స సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి తొలుత ఈ సినిమాకు అనుకున్న టైటిల్ ఇదికాదట. దర్శకుడు పూరి దీనికి ‘గంగ-రాంబాబు’ లేదా ‘గంగతో రాంబాబు’ టైటిల్ అనుకున్నారట.

వీటితో దర్శకుడు పూరి పవన్‌ను సంప్రదించగా....ఈ టైటిల్ బాగోలేదని, పైగా న్యూమరాలజీ, ఆల్పాబెటికల్ ఆర్డర్ ప్రకారం కూడా ఇది కలిసి రావడం లేదని భావించాడట పవన్. అందుకు కారణం ఏమిటంటే...‘జల్సా’ హిట్ తర్వాత పవన్ నటించిన పులి, తీన్ మార్, పంజా చిత్రాలు పరమ ప్లాపులుగా మారాయి.

సెంటిమెంటు ప్రకారం జల్సా ఇంగ్లీ అక్షరాల్లోని తొలి అక్షరం j కంటే తక్కువగా అక్షరంతో సినిమా పేరు మొదలైతేనే పవన్‌కు హిట్ వస్తుందని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతకంటే ఎక్కవ అక్షరంతో మొదలు కాబట్టే పులి(p), తీన్ మార్(T), పంజా(P) చిత్రాలు ప్లాపయ్యాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ చిత్రం టైటిల్ G అక్షరంతో స్టార్ అయ్యేలా చూశారు. ఆ తర్వాత సినిమా కోసం అయితే మరింత తక్కువ అక్షరంతో మొదలైతేనే బాగుంటుందని భావించి C అక్షరంతో మొదలయ్యేలా ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారట. పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకే ఈ మార్పులు చేశారు. గబ్బర్ సింగ్ విషయంలో ఫలించిన సెంటి మెంటు ...కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రంలో వర్కౌట్ అవుతుందో? లేదో? చూడాలి.

సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్...ఈచిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

No comments:

Post a Comment