పవన్ కళ్యాణ్ మీదనే బాలకృష్ణ ఆ పంచ్ ?
గురువారం, మే 31, 2012, 11:49 [IST]
అలాగే నిన్న రాత్రి జరిగిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో పంక్షన్ లో సైతం బాలకృష్ణ మాట్లాడుతూ..."ఇప్పటికే మేము చాలాసార్లు ట్రెండ్‌ను సృష్టించాం. దాన్ని ఇతరులు అనుసరిస్తున్నారు" అని అన్నారు. అలా ఒకటికి రెండు సార్లు బాలకృష్ణ ట్రెండ్ గురించి మాట్లాడటానకి కారణం గబ్బర్ సింగ్ లో ఆ డైలాగే నని చెప్తున్నారు. ఇక అధినాయకుడు చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు బాలకృష్ణ.
"రికార్డులతో మనకు పనిలేదు. మూడు వేషాలేసే దమ్మున్నోడెవడన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా. ఎంతోమందికి సమాధానం చెబుతుంది ఈ సినిమా'' అని చెప్పారు నందమూరి బాలకృష్ణ. అధినాయకుడు'లో త్రిపాత్రాభినయం చేశా. మూడూ వైవిధ్యమైన పాత్రలే. ఈ మూడు పాత్రల్లో ఎవరు అధినాయకుడు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. నా దృష్టిలో మూడు పాత్రలూ అధినాయకుడే. ట్రెండ్‌తో మనకు పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్. ఇందులో పెద్దాయన కేరక్టర్ మొదట అనుకోలేదు. ఆ పాత్రను దర్శకుడు పరుచూరి మురళి అద్భుతంగా తయారుచేశారు. నేనేం చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది.
కల్యాణీమాలిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు ఇదో మంచి అవకాశం. కేరక్టర్ని ఎలివేట్ చేసే పాత్రలు నా సినిమాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది ఇటీవల 'ప్రచారానికి వస్తున్నారా?' అనడిగారు. 'వస్తున్నా. సినిమా వస్తోంది' అని చెప్పా. ప్రజల్లో తిరుగుబాటునీ, ఆలోచననీ తీసుకువచ్చే చిత్రమే 'అధినాయకుడు'. మణిపూసల్లాంటి సాహిత్యం అందించారు ఐదు పాటల్లో భాస్కరభట్ల. మా సినిమా గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు లేదు. యాక్టింగ్ అంటే పరకాయ ప్రవేశం చెయ్యడం. ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ చిత్రం. అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ఆనందింపజేస్తుంది. ఓ పాత్రకి భాష కూడా మార్చా ఇందులో. ఓ ప్రాంతానికి సంబంధించిన యాస విషయంలో ప్రయోగం చేశా'' అని చెప్పారు.
No comments:
Post a Comment