Pages

Saturday, 26 May 2012

రాజమౌళి-పవన్ కళ్యాణ్ లతో సినిమాకు బండ్లగణేష్ రెడీ

పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడిగినా నేను రెడీ అని రాజమౌళి, నేను ఎవరినీ సినిమాలు చెయ్యమని అడగను అని పవన్ కళ్యాణ్ .. కచ్చితంగా సినిమా రాదు అని అందరూ డిసైడ్ అయిపోయారు. కాని వీరి కలయికతో సినిమా రావాలని ఒక వర్గం మెగా అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.
వీరిద్దరితో భారీ సినిమా నిర్మించగల సత్తా అల్లు అరవింద్ లేదా అశ్వనీదత్ లకు మాత్రమే వుందనుకున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమా రియల్ ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతున్న తరుణంలో, పవన్ అభిమానుల డ్రీమ్స్ మేరకు వీరిద్దరిని కలిపే బాద్యత బండ్ల గణేష్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీను వైట్ల - ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ నిర్మించబోయే ఈ సినిమా రాజమౌలి-ప్రభాస్ చిత్రం కంటే ముందే వుంటుంది. బండ్లగణేష్, పవన్ కల్యాణ్-పూరిలతో చేద్దామనుకున్నాడు కాని, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చిత్రం పూరి జగన్నాథ్ తోనే కావడం వలన పూరి జగన్నాథే రాజమౌళిని contact చెయ్యమని బండ్ల గణేష్ కు చెప్పాడని సమాచారం.
ఈ న్యూసే నిజమైతే స్వరవాణి యం.యం కీరవాణి, పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే మొదటి చిత్రం అవుతుంది.

No comments:

Post a Comment