Pages

Thursday, 31 May 2012

హాట్ న్యూస్: 'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ ఖరారు

హాట్ న్యూస్: 'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ ఖరారు

గురువారం, మే 31, 2012, 12:24 
Get Ready Sequel Gabbar Singh
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ హిట్ కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు ఫిక్సైపోయారు. ఈ విషయాన్ని ఆయన మీడియా వద్ద కన్ఫర్మ్ చేసారు. దబాంగ్ 2 రైట్స్ సల్మాన్ ఖాన్ ఇస్తామని తనకు ప్రామిస్ చేసారని అన్నారు. అయితే హరీష్ శంకరే దర్శకుడా మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియలేదు.

త్వరలో పవన్ తో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు.

గబ్బర్ సింగ్ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం’’ అన్నారు. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి ప్రశంసించారని, ‘దబాంగ్ 2’లో ఈ సినిమా సన్నివేశాలను వాడుకోవాలని సల్మాన్ భావిస్తున్నారని ఈ సందర్భంగా గణేష్ తెలిపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న ‘బాద్‌షా’ పనిలో ఉన్నాననీ, అలాగే పూరిజగన్నాథ్‌తో రెండు సినిమాలు చేయబోతున్నాననీ, అక్టోబర్‌లో వాటిలో ఒకటి మొదలవుతుందనీ, ఓ అగ్రహీరో నటించే ఆ సినిమా వివరాలను పూరీనే ప్రకటిస్తారనీ గణేష్ తెలిపారు. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

No comments:

Post a Comment