‘గబ్బర్ సింగ్’ 4 వీక్స్ షేర్ డీటేల్స్
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గడిచిన నాలుగు వారాల్లో రూ. 60.74 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓ ఇంగ్లీష్ బిజినెస్ పత్రిక కథనం ప్రకారం ఈ చిత్రం కలెక్షన్ల రూ. 100 కోట్లు దాటాయని తెలుస్తోంది.
ఏరియా వారిగా ఈచిత్రం సాధించిన షేర్ విషయానికొస్తే...
నైజాం : 17.55
సీడెడ్ : 8.04
నెల్లూరు : 1.75
కృష్టా : 2.91
గుంటూరు : 3.94
వైజాగ్ : 4.55
ఈస్ట్ : 3.35
వెస్ట్ : 2.90
ఏపీ 4 వారాల కలెక్షన్స్ : 44.99
కర్నాటక : 4.05
రెస్టాఫ్ ఇండియా : 2.70
ఓవర్సీస్ : 9.00
4 వీక్స్ వరల్డ్ వైడ్ షేర: 60.74 (అయితే ఈ వివరాలు అధికారికంగా దృవీకరణ కావాల్సి ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా హాజరు కానున్నారు. ‘గబ్బర్ సింగ్' విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని షీల్డ్‌తో సత్కరించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకగా షీల్డ్ డిజైన్ చేయించారు. హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్