Pages

Tuesday, 26 June 2012

'గబ్బర్ సింగ్' 50 డేస్ సెంటర్స్ లిస్ట్

మంగళవారం, జూన్ 26, 2012, 10:03 [IST]
పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం హిస్టారికల్ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జూన్ 29 నాటికి యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎక్కువ సెంటర్లు లలో ఉండటం కూడా ఓ రికార్డు ని నమోదు చేసింది. ఎగ్డిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రంతో చాలా ఖుషీగా ఉన్నట్లు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ఓ జెన్యూన్ హిట్ గా తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని పరిగణిస్తోంది.
gabbar singh 50 days centres with area wise list

యాభై రోజులు రన్ అయిన థియేటర్స్ (ఏరియాల వారిగా)

ఏరియా సెంటర్లు
నైజాం 78
సీడెడ్ 53
నెల్లూరు 15
కృష్ణా 17
గుంటూరు 16
వైజాగ్ 35
ఈస్ట్ గోదావరి 23
వెస్ట్ గోదావరి 13

50 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 252
నిర్మాత బండ్ల గణేష్ బాబు మాట్లాడుతూ...పవన్‌కల్యాణ్ 'గబ్బర్‌సింగ్' రాకతో మునుపటి రికార్డులన్నీ ఎగిరిపోయాయి. మా సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా మా హీరో అలాంటివేమీ పట్టించుకోకుండా తోటపని చేసుకుంటున్నారు. ఆయన వీటిని పట్టించుకోర ని అన్నారు. త్వరలో ఈ సినిమా విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఈ సినిమాని పైరసీ నుంచి కాపాడిన అభిమానులకు సన్మానం చేస్తాం అని చెప్పారు.
హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలోని పాత రికార్డులను తన కలెక్షన్స్ తో చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.

No comments:

Post a Comment