Pages

Sunday, 10 June 2012

వేరే హీరో సినిమా ఫ్లాప్ కి ఆనందపడ్డా:అల్లు అర్జున్

వేరే హీరో సినిమా ఫ్లాప్ కి ఆనందపడ్డా:అల్లు అర్జున్

Allu Arjun About Pawan Kalyan

ఓ సారి వేరే హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను ఆనందపడ్డాను. అప్పుడు ‘అలా ఆనందపడకూడదు. చాలా కష్టపడి సినిమా చేసుంటారు కదా' అని సున్నితంగా మందలించారు పవన్‌కళ్యాణ్. ఆయన రియల్‌స్టార్ అనడానికి ఇదే నిదర్శనం అన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘జులాయి' చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇలా స్పందించారు.

అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ..నా దృష్టిలో ఆయనకు ఆయనే పోటీ.
నా దృష్టిలో రియల్‌స్టార్ అంటే పవర్‌స్టారే. పవన్‌కళ్యాణ్ రావడం వల్ల ఈ వేడుక కొత్త కళను సంతరించుకుంది. ఫైట్లు, డాన్సులు గొప్పగా చేసినంత మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా వల్లించినంత మాత్రాన ఎవరూ పెద్ద స్టార్లు అయిపోరు. ఇక్కడ ప్రవర్తన ముఖ్యం. ఈ మధ్య హిట్ అనిపించుకున్న ఏ సినిమా పోస్టర్ చూసినా ఆల్‌టైమ్ రికార్ట్ అని కనిపిస్తుంది. కానీ ‘గబ్బర్ సింగ్' పోస్టర్‌లో మాత్రం ఆ అక్షరాలు కనిపించవు. ఎందుకంటే... పవన్‌కళ్యాణ్‌కి అభద్రతాభావం లేదు అన్నారు.

ఇలియానా హీరోయిన్ గా చేసిన ‘జులాయి'చిత్రానికి డీవీవీ దానయ్య సమర్పకుడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని దాసరి నారాయణరావుకు అందించారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు రాజమౌళి, శ్రీనువైట్ల, హరీష్‌శంకర్‌, రాజేంద్రప్రసాద్‌, డి.సురేష్‌బాబు, రమేష్‌ ప్రసాద్‌, రాధాకృష్ణ, దానయ్య, తమన్నా తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు

No comments:

Post a Comment