Pages
Wednesday, 25 July 2012
పవన్ కళ్యాణ్ 'పవనిజం'పై స్పెషల్ సాంగ్..
పవన్ కళ్యాణ్ 'పవనిజం'పై స్పెషల్ సాంగ్..
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులుకు 'పవనిజం'అంటే ఏంటో తెలుసు. అలాగే అది ఏ రేంజిలో ఉంటుందో బయిట వాళ్లకి తెలుసు. ఈ నేపధ్యంలో త్వరలో పవన్ కళ్యాణ్ 'పవనిజం'పై ప్రత్యేకమైన పాటను షూట్ చేయనున్నారు. ఈ విషయాన్ని పంజా నిర్మాత నీలిమ తిరుమల శెట్టి తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఆమె ట్విట్టర్ లో...త్వరలో పవన్ కళ్యాణ్ ..పవనిజం పై ప్రత్యేకమైన పాటను చూడబోతున్నాం అని ట్వీట్ చేసారు.
గబ్బర్ సింగ్ చిత్రం యాబైవ మైలురాయిని విజయవంతంగా తిరుగులేని కలెక్షన్స్ పై దాటిన సందర్భంగా ఈ పాటను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అయితే ఈ పాటను తీసే డైరక్టర్ ఎవరు..ఏంటి అన్నది తెలియలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాసం ఉంది. ఓ స్టార్ డైరక్టర్ ఈ పాటను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే హరీష్ శంకర్ ఈ పాటను ప్లాన్ చేసాడని కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అయితే త్వరలోనే పూర్తి డిటేల్స్ రానున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్నపూర్ణం సెవన్ ఏకర్స్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఆయన మరో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో కూడా పూరి జగన్నాధ్...పవన్ అభిమానులతో కలిసి ఓ పాటను చిత్రీకరించనున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఈ పాట చిత్రీకరణ జరగాల్సిందే కానీ..ఎడతెగని వర్షాలతో వాయిదా వేసినట్లు పూరీ జగన్నాధ్ తెలిపారు. ఎంపిక చేసిన అభిమానులు ఓ పాటలో పవన్ తో పాటు కనిపస్తారు.
అలాగే ఆ మధ్యన సారిధీ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన ఐటం సాంగ్ ని హైదరాబాద్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్ గీతం చేసింది. సారధీలో షూటింగ్ జరిగినంత కాలం అభిమానలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా పవన్ ని చూడటానికి ఆసక్తి చూపించారు. దాంతో ఫ్యాన్స్ అంతా తమ పవన్ కళ్యాణ్ పవనిజం తెలిపే ఆ పాటం కోసం ఎదురుచూస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment