Pages

Tuesday, 31 July 2012

పవన్ కళ్యాణ్ పై ఆ రూమర్.. నిజమేనా?


Pawan Kalyan Play Jesus Christ

హైదరాబాద్: రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బాలీవుడ్ కు ప్రయాణం కట్టారని, కొండా కృష్ణం రాజు దానికి నిర్మాత అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది పవన్ కళ్యాణ్ చేసే స్క్రిప్టు మరేదో కాదని గతంలో...మొదలెట్టి ఆపేసిన ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారీగా మొదలెట్టిన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో పవన్ కళ్యాణ్ జీసస్ క్రైస్ట్ అని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ కోసం తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునేషన్ కోసమే పవన్ తిరిగి ఆ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. అదే స్క్రిప్టుని రీ మోడల్ చేసి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇది రూమరా,నిజమా అన్నది తెలియని సందిగ్ద స్దితిలో ఉంది. నిర్మాతలు ఈ విషయమై స్పషటమైన ప్రకటన చేస్తే బావుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సారి సింగీతం గారు డైరక్టర్ గా కొనసాగుతారా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది.
ఇక అప్పట్లో ఈ చిత్రం గురించిన వార్తలను పరిశీలిస్తే...పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ కి ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం.జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారు. ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
జెకె భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్‌ సూత్రాల్ని పాటించారని చెప్తున్నారు అన్నారు.

No comments:

Post a Comment