పవన్ కల్యాణ్
చిరంజీవికి ... పవన్ కల్యాణ్ కి పడటంలేదు ... అనే వార్తలు ఈమధ్య ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ ఖండించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఓ లోపం జరగడం ... దానిని పట్టుకుని అందరూ రకరకాల కథనాలు అల్లుకోవడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఇటువంటి పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే వేదికపై 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ఈ సినిమా యూనిట్ సభ్యులంతా హాజరుకావాలని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.
అలాగే మెగా అభిమానులు మెగా సంఖ్యలో హాజరుకావడానికి అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ విషయం బయటకి రావడంతో, అపార్ధాలకి తెరదింపడంకన్నా ఓ అన్నయకి తమ్ముడు ఇచ్చే గొప్ప కానుక ఏముంటుందని అభిమానులు అనుకుంటున్నారు!
No comments:
Post a Comment