గబ్బర్ సింగ్ నిర్మాత వ్యాఖ్యలు-నిరాశలో పవన్ ఫ్యాన్స్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్
సింగ్' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ
సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... 65 సెంటర్లలో మా
చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, 81 ఏళ్ల తెలుగు సినిమా
చరిత్రలో నెం.1 చిత్రం మాదైనందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు.
అయితే
సినిమా కలెక్షన్ల ఎంత? 100 రోజుల ఫంక్షన్ ఎప్పుడు? అనే ప్రశ్నలకు మాత్రం
బండ్ల గణేష్ స్పందిస్తూ....పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదు, ఆయన బయట
పెట్టొద్దన్నారు అని సమాధానం ఇచ్చారు. ఈ చిత్రం అంత కలెక్ట్ చేయలేదని బయట
చర్చించుకుంటున్నారు కదా..? అని ప్రశ్నించగా..... మాట్లాడుకునే వాళ్లు
మాట్లాడుకోనివ్వండి. కలెక్షన్ల గురించి చెప్పాల్సిన అవసరంలేదు. అసలు
చెప్పనే చెప్పమని తేల్చి చెప్పారు. తమ హీరో రికార్డు స్థాయి కలెక్షన్ల
గురించి గొప్పగా ప్రకటించుకుందామని అనుకున్న అభిమానులు గణేష్ ప్రకటనతో
నిరాశకు గురయ్యారు.
100 రోజుల ఫంక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారు అని
ప్రశ్నించగా....మరోసారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా సమాధానం ఇచ్చారు నిర్మాత
గణేష్. ఈ వేడుక చేయాలా వద్దా అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద ఆదార పడి
ఉంటుంది. ఆర్భాలంటే ఆయనకు ఇష్టం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి 100 రోజుల
వేడుక ఫంక్షన్ నిర్వహించడం లేదని స్పష్టమవుతోంది.
సినిమా జయాపజాయాలతో పవన్ కళ్యాణ్ కి పని లేదని, సినిమా సినిమాకు ఆయన రేంజి పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఇమేజ్ జయాపజయాలకు అతీతమైనది అని గణేష్ చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ విజయంతో మరో 20 ఏళ్లు పరిశ్రమలో ఉండగలిగే ధైర్యం వచ్చింది అని గణేష్ తెలిపారు.
No comments:
Post a Comment