పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో రూపొందిన ‘బ్రది' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన పూరి మళ్లీ పవన్ తో చేస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంతో 25 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అంటే 12 ఏళ్లలో యావరేజ్‌గా 2కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఇంత స్పీడుగా ఎవరూ సినిమాలు చేయలేదు.
టాప్ డైరెక్టర్ రాజమౌళి తన 11 ఏళ్ల కెరీర్లో 9 సినిమాలు చేయగా...వివి వినాయక్ తన 10 ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు చేసారు. శ్రీను వైట్ల తన 14 ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు పూర్తి చేసాడు. ఇక త్రివిక్రమ శ్రీనివాస్ తన 10 ఏళ్ల కెరీర్లో 5 సినిమాలు మాత్రమే చేసారు. వీళ్లతో పోల్చుకుంటే పూరి స్టైల్ మహా స్పీడు. పైగా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా అమితాబ్ తో బుడ్డా హోగా తెరా బాప్ చిత్రం రూపొందించి బాలీవుడ్లో కూడా తన ముద్ర వేసుకున్నాడు.
No comments:
Post a Comment