హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల వివరాలు చెప్పడం లేదు కానీ...81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అని ప్రకటనలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కలెక్షన్ల వివరాలు చెప్పడం పవన్‌కు ఇష్టం లేదని నిర్మాత బండ్ల గణేష్ ఇప్పటికే వెల్లడించారు. కనీసం 100 రోజుల వేడుకైనా జరుపుతారా? అంటే పవన్‌కి ఆర్భాటాలంటే ఇష్టం ఉండదని, ఆయన నిర్ణయం మీదే గబ్బర్ సింగ్ 100 రోజుల వేడుక ఆధార పడి ఉందని స్పష్టం చేసారు.
అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం....‘కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నేపథ్యంలోనే ఆ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయ్యే వరకు జనంలోకి రాకూడదని పవన్ నిర్ణయించుకున్నాడని, అందుకే ‘గబ్బర్ సింగ్' 100 రోజుల వేడుక జరుపకూడదని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' ఆడియో వేడుకలోనే చిన్నగా ‘గబ్బర్ సింగ్' విజయోత్సవం నిర్వహిస్తారని తెలుస్తోంది.
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది. చకచకా పనులు ముగుస్తుండటంతో అనుకున్న సమయం(అక్టోబర్ 18) కంటే వారం ముందుగానే అక్టోబర్ 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్లో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సరసన ఈచిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్ స్టార్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
No comments:
Post a Comment