హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.....బాగా ఇంప్రెస్ అయిన పాప్ గాయకుడు
బాబా సెహగల్ ‘పవర్ సాంగ్' కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్
యొక్క తత్వాన్ని ‘పవనిజం' అంటూ ఆరాదిస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపే
విధంగా ఈ సాంగ్ ఉండనుంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని
సెప్టెంబర్ 2న ‘పవర్ సాంగు'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా
ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా సెహగల్ మాట్లాడుతూ...పవర్
సాంగ్ పవన్ కళ్యాణ్‌కి భజనలా ఉండదని స్పష్టం చేసారు. పవర్ స్టార్ యొక్క
ఇమేజ్‍ని, ఆయన ప్రత్యేకతని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని వివరిస్తూ... అతనిపై
ప్రేక్షకులు, అభిమానులు కురిపిస్తున్న అభిమానాన్ని ప్రతిభింభిస్తూ
ఉంటుందన్నారు.
తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడటం మొదలు
పెట్టాక పవన్ కళ్యాణ్ గురించి తెలిసింది. పవన్‌కి ఉన్న ట్రెమండస్ ఫ్యాన్
ఫాలోయింగ్ చూసి ఆశ్యర్య పోయారు. పీపుల్ ఆయన పట్ల అంత క్రేజీగా ఉండటానికి
కారణం ఏమిటో ఆయన సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను కూడా
పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ అయిపోయానని బాబా సెహగల్ చెప్పుకొచ్చారు. పవర్
సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారికి అంకితం ఇవ్వనున్నట్లు
తెలిపారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'
చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి
దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం
షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం
కానున్నాయి. అక్టోబర్ 11న ఈచిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
No comments:
Post a Comment