Pages

Sunday, 2 September 2012

పవర్ స్టార్ ప్రస్థానం... (బర్త్ డే స్పెషల్)


హైదరాబాద్: అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగా స్టార్ చిరంజీవి తమ్ముడుగా హీరోగా పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని తొలి ప్రేమతో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి తమ్ముడుతో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి బద్రితో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని ఖుషితో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమురం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెమెరా‌మెన్ గంగతో రాంబాబుతో మరోసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి వస్తున్నాడు.
happy birthday pawan kalyan
ఆయన అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్), పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య . పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. సెప్టెంబర్ 2తో 41వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వన్ ఇండియా తెలుగు తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

No comments:

Post a Comment