హైదారాబాద్:
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో పర్ ఫెక్షన్ కోసం
పరితపిస్తుంటారు. పాత్రలకు తగిన విధంగా నటులు ఎంపిక చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్
చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల జులాయి సినిమాతో హిట్ కొట్టిన
త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా పవన్ కళ్యాణ్‌తో చేసేందుకు రెడీ
అవుతున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న గాసిప్స్‌ను గమనిస్తే.... ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
సరసన హీరోయిన్ అంజలి(జర్నీ ఫేం)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తను
అనుకున్న హీరోయిన్ క్యారెక్టర్‌కు ఆమె సరిగ్గా సూటవుతుందని త్రివిక్రమ్
భావిస్తున్నాడట. అయితే ఈవిషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
షాపింగ్ మాల్, జర్నీ లాంటి డబ్బింగ్ చిత్రాల్లో తన టాలెంట్ ప్రూవ్ చూసుకున్న అంజలి
ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఆమె శ్రీకాంత్ అడ్డాల
దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లు చెట్టు' చిత్రంలో
వెంకటేష్‌కు జోడీగా నటిస్తోంది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ
చిత్రం అక్టోబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామెడీ అండ్
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి
వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.