Pages

Sunday, 30 September 2012

త్రివిక్రమ్ తర్వాత పవన్ చెయ్యబోయే దర్శకుడు ఎవరంటే...

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన మరో భారీ ప్రాజెక్టు ఓకే అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్,పవన్ కల్యాణ్ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన‘కెమెరామెన్ గంగతో రాంబాబు'చిత్రం విడుదల అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో పవన్ బిజీ అవుతారు. అది పూర్తైన వెంటనే గ్యాప్ లేకుండా శ్రీను వైట్ల సినిమా చేస్తారు.
రీసెంట్ గా పవన్ ఈ చిత్రానికి సంభందించిన స్టోరీ లైన్ విని...సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. శీను వైట్ల మార్కుతో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా ‘బాద్ షా'చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైతం బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం అక్టోబర్ 18 న భారీగా విడుదల కాబోతోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. పవన్ సరసన తమన్నా నటించగా, డి.వివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్‌ గరమ్‌గా ఉంటుందని సమాచారం.

తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

No comments:

Post a Comment