Pages

Friday, 7 September 2012

పవన్, త్రివిక్రమ్‌తో చాన్స్ ఎందుకు వద్దనుకుంది?

Ileana Rejects Hat Trick
హైదరాబాద్ : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన జల్సా, జులాయి చిత్రాలు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆమెను పవన్‌ కళ్యాణ్‌తో తను చేయబోయే తర్వాతి సినిమాలో కూడా తీసుకుని హాట్రిక్ విజయం సాధించాలని ప్లాన్ చేసాడు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో ఈ ఆఫర్ ను వదులకుంది ఈ గోవా సుందరి.
ఇటీవల జల్సా సినిమా పూర్తి చేసిన త్రివిక్రమ్...పవన్‌తో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం పూర్తి కాగానే పవన్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలియానాను డేట్స్ కోరగా....తాను ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలకు కమిట్ అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ అడిగిన డేట్స్ కేటాయించలేనని తేల్చి చెప్పిందట.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కన్ను కాజల్ అగర్వాల్‍‌పై పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాజల్ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘బాద్ షా' చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా రామ్ చరణ్ తో నాయక్, మహేష్ బాబు హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు సూర్య హీరోగా తమిళంలో డూప్లికేట్, విజయ్ హీరోగా రూపొందుతున్న తుపాకి చిత్రంలో చేస్తోంది.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ డేట్స్ కన్ ఫర్మ్ అయితే కానీ త్రివిక్రమ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం లేదు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

No comments:

Post a Comment