Pages

Monday, 22 October 2012

హాట్ టాపిక్: 'రాంబాబు' కట్స్ 3 నిముషాలు మాత్రమే?



హాట్ టాపిక్: 'రాంబాబు' కట్స్ 3 నిముషాలు మాత్రమే?

Only 3 Mins Footage Deleted From Cgr Movie

హైదరాబాద్: పూరీ జగన్నాథ్‌, పవన్‌ కళ్యాణ్‌ల కలయికలో రూపొందిన కొత్త చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' వివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కలగచేసుకుని కమిటీ వేసి ఈ చిత్రంలో కట్స్ తో విడుదల చేయమంది. మరి కట్స్ పూర్తయ్యాక ఈ చిత్రం లెంగ్త్ ఎంత ఉండనుందనే విషయం నిన్నటి నుంచీ పవన్ అబిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ సినిమాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏడు సీన్లను కత్తిరించాలని సూచిస్తూ సమాచారశాఖ మంత్రి డీకే అరుణకు నివేదికను అందజేసింది. అసలే సినిమా డ్యూరేషన్ తక్కువ. దానికి తోడు కట్స్ అంటే కష్టమే. దాంతో మొదటి పూరీ ఒప్పుకుని తీసేసిన కొన్ని సీన్స్, గవర్నమెంట్ కమిటీ చెప్పిన సీన్స్ అన్ని కలిపి 15 సీన్స్ అవుతాయని, వాటిని తీసేస్తే దాదాపు 45 నిముషాలపాటు సినిమా పోతుందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంక అప్పుడు కేవలం గంట ముప్పై ఒక్క నిముషమే మిగులుతుందని, అంతేగా వాటిల్లోంచి పాటలు,పైట్స్ డ్యూరేషన్ పోతే సినిమా కధకు సంభందించిన ఉంటుందని అబిమానులు ఆందోళన పడ్డారు. ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి వాటిల్లో ఈ లెంగ్త్ పై చర్చలు సైతం జరిగాయి.
అయితే ఈ సినిమాకు పనిచేసిన బి.వియస్ రవి మాత్రం అటువంటిదేమీ జరగదని,అది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అంటూ రూమర్స్ అని కొట్టిపారేసారు. ఆయన తన ట్వీట్ లో ..." రాంబాబు చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్స్ కీ, లీడర్స్ కు కుదిరిన ఎగ్రిమెంట్ ప్రకారం మూడు నిముషాలు ఫుటేజ్ మాత్రమే డిలేట్ చేసారు" అలాగే... "మిగతా సినిమా అలాగే ఉంటుంది. ఫుటేజ్ డిలేట్ అంటూ ప్రచారమవుతున్న వార్తలు నమ్మద్దు. అవి రూమర్స్ మాత్రమే" అని క్లారిఫై చేసారు.
ఇక 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమాలో నిపుణుల కమిటీ కొన్ని కట్స్‌ను సూచించినప్పటికీ ఆదివారం ప్రదర్శనల్లో చిత్రాన్ని యథాతధంగా చూపించినట్టు తెలంగాణాకు చెందిన నమస్తే తెలంగాణా పత్రిక తెలియచేసింది. సెన్సార్ బోర్డులో కొన్ని కట్స్‌ను సూచించిన తరువాత వాటిని సినిమా నుంచి తొలగించాలి. కానీ దర్శక నిర్మాతలకు పైత్యం ముదిరి కొన్ని మెయిన్ థియేటర్లలో కట్స్ చూపించి, మిగిలిన థియేటర్లలో కట్స్‌తో కలిపి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలను పెంపొందించే సన్నివేశాలు యథావిధిగానే ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టి పోలీసు స్టేషన్‌కు ఎక్కితేగాని ఆ నిర్మాతలు కన్ను తెరవరు అని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ కమిటీ చెప్పిన ఆ కట్స్ ఏమిటంటే...
* తెలుగుతల్లిపై దృశ్యాలు
* ఢిల్లీ అతిథిగృహంలో లీడర్‌ ఉన్నది
* బ్యాక్‌గ్రౌండ్‌లో నిజాం నవాబు ఫొటో కనిపిస్తున్న దృశ్యం
* తెలంగాణ కావాలా వద్దా అనే మాటలున్నది
* ఆత్మహత్యలపై ఉన్న మాటలు
* హాస్టళ్ల విద్యార్థులను ఉద్యమంలోకి తెస్తున్నారనే దృశ్యం
* సెటిలర్లు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారనే మాటలు

No comments:

Post a Comment