Pages

Tuesday, 24 September 2013

ఇంటి దొంగ‌ను ఈశ్వరుడైన ప‌ట్టలేడంటారు.అయితే నిర్మాత బి ఎస్ ఎన్ ప్రసాద్ మాత్రం ప‌ట్టు కో గ‌లిగారు. “అత్తారింటికి దారేది” సినిమాను లీకేజి చేసిన దొంగ మ‌రేవ‌రో కాదు. నిర్మాత ఆఫీస్ లో ప‌ని చేసే అసిస్టెంట్ అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఇత‌గాడు అత్తారింటికి దారేది సిడిని తీసుకెళ్లి త‌న స్నేహితుడైన ఎపి ఎస్పీ కానిస్టెబుల్ ఒక‌డికి ఇచ్చాడ‌ట‌., మ‌రి సినిమా విడుద‌ల కాక ముందు ఈ సీడిని అరుణ్ కుమార్ తీసుకెళ్లి ఇవ్వడం వెన‌క వాళ్ల బిజినెస్ ప్లాన్ ఏదో ఖ‌చ్చితంగా ఉంది. ఎపి ఎస్పి కానిస్టెబుల్ తీసుకెళ్లి కృష్ణ జిల్లా పెడ‌న టౌన్ లో సీడి షాపు వాడికి అమ్ముకున్నట్లు తెలుస్తుంది. ఆ షాపు వాళ్లు సీడిని 50 రూపాయ‌ల చొప్పున అమ్మడం జ‌రిగింది.

సొంత ఆఫీస్ ల్ ప‌ని చేసే వాళ్లంటే న‌మ్మక‌స్తులై వుంటార‌ని అనుకొంటారు. కానీ.. ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టె అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడ వుంటార‌ని ఈ సంఘ‌ట‌న నిరూపించింది. దీంతో నిర్మాత‌లంతా త‌మ ద‌గ్గర ప‌ని చేసే వాళ్లను కూడా ఓ కంట క‌నిపెడుతూ వుండాలంటున్నారు పరిశీల‌కులు.అయితే మొత్తం మీద అరుణ్ కుమార్ పుణ్యమా అత్తారింటికి దారేది విడుద‌ల‌కు వే ఈజీ అయ్యింద‌ని సంబ‌ర ప‌డుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్. ఎలాగూ సినిమా సూప‌ర్ గా ఉంద‌ని తెలియ‌డంతో.. ఈ లీకేజి కూడా క‌లిసొచ్చిందిలే అని లైట్ తీసుకుంటున్నారు మ‌రి.!

No comments:

Post a Comment