Pages

Tuesday 31 July 2012

'కెమెరామేన్ గంగతో..'లో పవన్ గెటప్ ఇదే


Pawan Kalyan Getup Cameraman Gangatho Rambabu

హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చాలా గ్లామర్ గా కనిపించనున్నారు. ఈ మేరకు ఓ స్టిల్ రిలీజై నెట్ లో అభిమానలందరి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పద్మాలయాలో షూటింగ్ జరుపుకుంటోంది. పద్మాలయా స్టూడియోలో ఓ భారి సెట్ వేసి షూట్ చేసారు. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొన్న ఓ రోజు అనుకున్నారు కానీ వర్షం రావటం తో కుదరలేదు. ఇక పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.
'గబ్బర్‌సింగ్‌' ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

No comments:

Post a Comment