Pages

Monday 22 October 2012

‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు వద్ద కేక పుట్టించే కలెక్షన్లు కురిపిస్తోంది

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు వద్ద కేక పుట్టించే కలెక్షన్లు కురిపిస్తోంది. పవర్ స్టార్ గత సినిమా ‘గబ్బర్ సింగ్' 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిస్తే...రాంబాబు మూవీ ఆ మూవీ రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 14.37 కోట్లు సాధించింది. అయితే సెకండ్ రోజు ఈచిత్రంపై తెలంగాణ ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు జరుగడంతో కలెక్షన్లు కాస్త డ్రాఫ్ అయ్యాయి. అయితే తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఈచిత్రంలో వివాదాస్పద డైలాగులు, సీన్లను తొలగించడంతో మళ్లీ ప్రదర్శన మొదలైంది. ఆ ఆందోళన కార్యక్రమాలే సినిమాకు ప్లస్సయ్యాయా....అన్నట్లు సినిమా పుంజుకుని కలెక్షన్లు భారీగా కురిపిస్తోంది.

తొలి వారాంతం కలెక్షన్ల వివారాల్లోకి వెళితే....తొలి రోజు(గురువారం) ఈచిత్రం రూ. 14.37 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 12.23 కోట్లు రాబట్టింది. శనివారం కావడంతో భారీగా బిజినెస్ పుంజుకుని రూ. 13 కోట్లు వసూలు చేసింది. ఆదివారం సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో రూ. 14.59 కోట్లు రాబట్టింది.

పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘గబ్బర్ సింగ్' తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ గా రూ. 42 కోట్లు వసూలు చేస్తే....‘రాంబాబు' మూవీ ఆ రికార్డును బద్దలు కొట్టి రూ. 54.19 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ రేంజిలో కలెక్షన్లు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించలేదు

No comments:

Post a Comment