Pages

Wednesday 25 September 2013

పారితోషికాన్ని వదులుకున్న పవన్?

పారితోషికాన్ని వదులుకున్న పవన్?
    Wed, Sep 25, 2013  



పవన్ కల్యాణ్  
యూ ట్యూబ్ లో సినిమా లీకవడం ... పైరసీ సీడీలు వచ్చేయడం  ... వంటి నష్టాలతో కుదేలైన 'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ ను ఆదుకోవడానికి హీరో పవన్ కల్యాణ్ ఎంతో వితరణ చూపినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న 12 కోట్ల రూపాయల పారితోషికాన్నీ తిరిగి చిత్ర నిర్మాతకు ఇచ్చేసినట్టు చెబుతున్నారు. తన సినిమా వల్ల ఏ నిర్మాతైనా లాభాపడాలే కానీ, నష్టాల పాలు కాకూడదన్న ఉద్దేశంతో పవన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, అవసరమైతే ఇంకా ఆదుకుంటానని కూడా పవన్ మాట ఇచ్చాడట. ఒకవేళ ఇదే కనుక వాస్తవమైతే, పవన్ నిజంగా అభినందనీయుడే. ఒక సరికొత్త సంప్రదాయానికి నాంది పలికినవాడవుతాడు కూడా!

1 comment:

  1. KENYA, Uganda | Online casino | kenyuk kenyuk
    KENYA, Uganda (Kenyuk 온카지노 Kenyuk-Kenyuk Kenyuk Kenyuk 1xbet korean is the 메리트 카지노 쿠폰 latest casino operator to reach the market, offering a wealth of gaming expertise.

    ReplyDelete