Pages

Friday, 1 June 2012

'గబ్బర్ సింగ్' టాప్ 1 అని చరణ్ ఒప్పుకుంటాడా?

'గబ్బర్ సింగ్' టాప్ 1 అని చరణ్ ఒప్పుకుంటాడా?

సినిమా కలక్షన్స్ మధ్య పోటి కేవలం ఫ్యాన్స్ ను రెచ్చ గొట్టే విధంగా మాత్రమే వుండకూడదు. నిజాలు ఒప్పుకోవాలి. ఎవరి మాటలో విని " Its official : నేనే నెం 1. నా సినిమా నెం 1 " అని మహేష్ బాబు మాదిరి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవివేకమే. పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్ రెస్పాన్స్ చూసి మీడియా చెప్పాలి. లేకపోతే పూరి జగన్నాథ్ ఒక లైవ్ షోలో 'మగధీర' సినిమా 'పోకిరి' సినిమాను కొట్టేసిందని చెప్పినట్టు రాజమౌలి/అల్లు అరవింద్/చరణ్ చెప్పాలి.
పైరసీ ప్రింట్ విచ్చలవిడిగా హలచల్ చేస్తున్నా కూడా, మాకు అందిన సమాచారం ప్రకారం మూడో వీకెండ్ అమెరికాలో చాలా చోట్ల టిక్కెట్స్ దొరక్క 30/40 మైళ్ళ దూరంలోని ఇంకో థియేటర్ కు డ్రైవ్ చేసుకొని మరీ 'గబ్బర్ సింగ్' చూసిన వాళ్ళు వున్నారు. ఇండియాలో థియేటర్స్ సంఖ్య తగ్గలేదు, థియేటర్స్ దగ్గర జనాలా సంఖ్య కూడా తగ్గలేదు.

idlebrain jeevi ‏@idlebrainjeevi
If a film is hit, producer dont tell numbers because of tax problems. If film is flop, producer publish fake collections. What an irony!
పవన్ కళ్యాణ్ కలక్షన్స్ కేర్ చెయ్యడు అనే వంకతో నిర్మాత కలక్షన్స్ గురుంచి అసలు మాట్లాడటం లేదు.
పవన్ కళ్యాణ్ కేర్ చెయ్యకపోయినా, నిజంగా 'గబ్బర్ సింగ్' టాప్ 1 అయిన రోజు, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఓపెన్ గా అభినందిస్తాడని ఆశీద్దాం.

No comments:

Post a Comment