Pages

Friday, 17 August 2012

మహేష్, పవన్ లలో రెమ్యునేషన్ ఎవరికి ఎక్కువ?


Pawan Kalyan Offered More Than Mahesh Babu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్,మహేష్ బాబు వీళ్లిద్దరూ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో టాప్ హీరోలు. గబ్బర్ సింగ్ సక్సెస్ తో పవన్ కళ్యాణ్,బిజినెస్ మ్యాన్ సక్సెస్ తో మహేష్ బాబు దూసుకుపోతున్నారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటారు..అనేది హాట్ టాపిక్. ఈ విషయమై ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ ఓ కథనం ప్రచురించింది. వీరి కథనం ప్రకారం పవన్ కళ్యాణ్ ..పదిహేను కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటూ టాప్ లో ఉన్నారు. వారి లెక్క ప్రకారం పవన్ హైయిస్ట్ పెయిడ్ తెలుగు హీరో. అయితే ఒక నిజం ఏమిటంటే..ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారనే విషయం ఆ హీరోల మేనేజర్స్ ,ఇచ్చిన నిర్మాతలు,హీరోకు తప్ప మరొకరికి కరెక్టుగా తెలియదు.
ఇక దాదాపు పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ..గబ్బర్ సింగ్ తో తన స్టామినా నిరూపించుకున్నారు. ఎన్ని వరస ప్లాప్ లు వచ్చినా ఆయన సినిమాలు ఓపినింగ్స్ ఎప్పుడూ తగ్గలేదు. ఓ మాదిరి టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం యాభై రోజులు పండగ జరుపుకున్నాయి. దీంతో ఆయన మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్దగానే ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని బి.వి.యస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆయన భారీగానే రెమ్యునేషన్ ఇచ్చినట్లు సమాచారం.
మహేష్ బాబు విషయానికి వస్తే.. ఖలేజా దాకా వరస ప్లాపుల్లో ఉన్న మహేష్ ఒక్కసారిగా దూకుడుతో తన స్టామినా ఏంటో చూపించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన దూకుడులో మహేష్ తన కామెడీతో సినిమాని ఓ రేంజికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రం కేవలం మహేష్ భుజాలపైనే మేసి నిలబెట్టి సక్సెస్ చేసారు. మహేష్ ఒన్ మ్యాన్ షోగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రం,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చిత్రాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment