హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు షూటింగ్ తాజా
షెడ్యూల్ ఈ మధ్యనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరబాద్ గచ్చిబౌళి
ఏరియాలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ ఓ
కీ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో చిరంజీవి,పవన్ కళ్యాణ్ ల భారీ
కటౌట్ లు పెట్టి అక్కడ ఈ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. దాంతో ఈ
సీక్వెన్స్ మెగాభిమానలనుకు పండుగలాగ ఉండబోతోంది.
రామ్ చరణ్ తేజ, వంశీ
పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ
చిత్రం ఏప్రియల్ 5,2013 న విడుదల చేయటానికి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు
సమాచారం. ఆ రోజునే ఎంపిక చేయటానికి కారణం దిల్ రాజు ప్రారంభ రోజుల్లో
నిర్మించిన దిల్ విడుదలైన రోజు అది. నితిన్ హీరోగా చేసిన ఆ చిత్రం సూపర్
హిట్ అయ్యింది. దాంతో సెంటిమెంట్ గా ఆ రోజు అయితే బావుంటుందని
నిర్ణంయించినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా
చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను
కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి
పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా
ఎంపిక చేసారు. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ..అవును..కాజల్ మా ఎవడు
చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా
కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సీన్స్ షూటింగ్ జరుగుతుంది అన్నారు.
రామ్
చరణ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత అంటే ఆగస్టు 7 నుంచి ‘ఎవడు' షూటింగ్
చేస్తున్నారు. కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి
వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ
వస్తున్నాడు. అల్లు అర్జున్,రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి
క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. పూర్తి స్ధాయి ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ
చిత్రం రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం
సమకూర్చుతున్నారు.
No comments:
Post a Comment