Pages

Tuesday, 4 September 2012

పవన్‌పై ఆవి రూమర్లే...మరో హీరో అభిమాని పనే?


హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూడో సెటప్ పెట్టారని, తీన్ మార్‌లో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్‌తో డేటింగ్ చేస్తున్నారని, వీరు ఇద్దరు అమ్మానాన్నలు కూడా అయ్యారని నిన్న టీవీ ఛానల్స్, నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలను మేం ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇవన్నీ వట్టి రూమర్లే అని తేలి పోయింది.
డానా మర్క్స్‌కు ఇప్పటికే కాల్విన్ మాస్సన్ అనే వ్యక్తితో మే 5, 2012లో పెళ్లయిందని... ప్రస్తుతం వారు కలిసే ఉంటున్నారని స్పష్టమవుతోంది. అయితే డానా మాత్రం గర్భవతి కాలేదని వాళ్ల రిలేషన్ షిప్ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది. ఎలాంటి ఆధారం లేకుండానే కేవలం పుకార్లను బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.
మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.... పవన్ కళ్యాణ్‌కి పోటీ‌గా టాలీవుడ్లో రాణిస్తున్న ఓ స్మార్ట్ స్టార్ హీరోకు సంబంధించిన అభిమాని రవి పవన్ కళ్యాణ్ ఇలాంటి రూమర్లు స్ర్పెడ్ కావడానికి కారణం అయ్యారని తెలుస్తోంది. అతని సోషల్ నెట్వర్కింగ్ లోని మెసేజ్‌లను పరిశీలించిన పవన్ అభిమానులు అతనిపై కేసు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా... పవనిజం అంటూ అభిమానిస్తున్న తమ హీరోపై ఉమనిజం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై నిజాలు నిగ్గు తేలడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

No comments:

Post a Comment