హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్‌మార్ చిత్రంలో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్‌తో మూడో కాపురం పెట్టారి, వీరు తల్లిదండ్రులు అయ్యారని మీడియా వార్తల నేపథ్యంలో ‘తీన్ మార్' చిత్ర దర్శకుడు జయంతి సి. పర్జానీ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి స్పందన లేదని తేల్చి చెప్పారు.
మీడియా నాన్సెస్‌గా ప్రవర్తిస్తోందని, పవన్-డానా గురించిన వార్తలు రెడిక్యులెస్ అంటూ ఘాటుగా స్పందించారు. డానా మార్క్స్ తన చిన్న నాటి స్నేహితుడు, సౌతాఫ్రిగా రగ్భీ ప్లేయర్ అయిన కాల్విన్ మాస్సను పెళ్లాడిందని తెలిపారు. పూర్తి విషయాలు, ఆధారాలు తెలుసుకోకుండా కొన్ని సార్లు మీడియా జోకర్‌లా ప్రవర్తిస్తుందంటూ సెటైర్లు విసిరారు.
జయంత్ సి. పర్జానీ గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘తీన్ మార్' చిత్రానికి దర్శకత్వం వహించిరు. త్రిష హీరోయిన్‌గా నటించగా...పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు. తీన్ మార్ చిత్రం హిందీ చిత్రం "లవ్ ఆజ్ కల్" కి రీమేక్. అయితే హిందీ వెర్షన్ మాదిరి తెలుగు రీమేక్ భారీ విజయం సాధించలేక పోయింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఆడియో విడుదల చేసి అక్టోబర్ 11న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment