Pages

Tuesday 29 May 2012

కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న 'గబ్బర్ సింగ్'

కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న 'గబ్బర్ సింగ్'

ఇంచుమించు తెలుగు సినిమాలన్నీంటికి మూల కథ ఒక ఇంగ్లీషు సినిమా వుండి తీరుతుంది. ’దబాంగ్’ సినిమాకు హరీష్ శంకర్ మార్పులు చేసి ’గబ్బర్‌సింగ్’ ఎలా తీసాడో, ఒక ఇంగ్లీష్ సినిమా మూలకథ తీసుకొని మన దర్శకులు మార్పులు చేసి తీస్తారు. ఇక్కడ కొత్త ఏమిటంటే, మన దర్శకులు వ్రాసుకునే సీన్స్ మరియు స్క్రీన్‌ప్లే.
ఆఫీషియల్‍గా ఒరిజినల్ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో తీస్తే రిమేక్ అంటారు, కాకపొతే ఫ్రీమేక్ అంటారు.
"ట్రెండ్‌ను ఫాలో అవ్వను- ట్రెండ్ క్రియేట్ చేస్తాను" అని పవన్‌కల్యాణ్‌తో చెప్పించిన హరీష్‌శంకర్, 'గబ్బర్ సింగ్' సినిమాతో నిజంగానే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు.ఆ ట్రెండ్ ఏమిటంటే "ఒక బాష నుంచి డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్ కొనుకున్న సినిమాను, ఒరిజనల్ సీన్స్ మార్పులు చేసి మరింత జనారంజకంగా తీర్చిదిద్దడమే కాదు, మళ్ళీ అదే బాషకు రిమేక్ రైట్స్ అమ్మడం".
Hats off to Harish Shankar!
పవన్‌కల్యాణ్‌ను ఎక్కడా ప్రస్తావించలేదని ఫీల్ అవ్వద్దు. పవన్ కల్యాణ్ అభిమాని చేసే ప్రతి పని వెనుక, పవన్‌కల్యాణ్ అనే పవర్ వుండి నడిపిస్తూ వుంటుంది. హరీష్‌శంకర్ చేసిన మార్పులన్నీ పవన్‌కల్యాణ్ అడిగిన మేరకే అని గమనించగలరు.
బండ్ల గణేష్, హరీష్ శంకర్ ఇంటార్వూలలో పవన్ కల్యాణ్ గురించి చెపుతుంటే ఆనందం ఆగడం లేదు.

No comments:

Post a Comment